గుక్కెడు నీటి కోసం.. 40 అడుగుల లోతున సాహసం

గుక్కెడు నీటి కోసం కొలాం గిరిజనులు పెద్ద సాహసమే చేయాల్సి వస్తోంది. ఒకరికొకరు సాయంతో ప్రమాదకరంగా బావిలో దిగి నీటిని తెచ్చుకుంటున్నారు.

Published : 01 Apr 2024 04:53 IST

గుక్కెడు నీటి కోసం కొలాం గిరిజనులు పెద్ద సాహసమే చేయాల్సి వస్తోంది. ఒకరికొకరు సాయంతో ప్రమాదకరంగా బావిలో దిగి నీటిని తెచ్చుకుంటున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం గట్టెపల్లి కొలాంగూడలో 105 మంది గిరిజనులు నివసిస్తున్నారు. ఇక్కడ వేసవి ఆరంభం నుంచే తాగునీటి ఎద్దడి మొదలైంది. ఊరంతటికీ ఒకే చేతి పంపు ఉంది. ప్రస్తుతం భూగర్భజలాలు అడుగంటడంతో అదీ ఎండిపోయింది. మిషన్‌ భగీరథ నీరు వారానికి ఒకరోజు అరగంటకు మించి రావడం లేదు. దీంతో గ్రామానికి 200 మీటర్ల దూరంలోని ఓ చేనులో 40 అడుగుల లోతున ఉన్న బావి నీరే వీరికి దిక్కైంది. ఏటవాలుగా దిగుతూ కిందకు వెళ్లిన తరువాత, నిచ్చెన సహాయంతో బావిలోకి దిగి పైన ఉన్న వారికి ఒక్కో బకెట్‌ నింపి అందిస్తున్నారు. బావి నీరు తాగటంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడు పట్టించుకొని మిషన్‌ భగీరథ నీరు రెండ్రోజులకు ఒకసారైనా వచ్చేలా చూడాలని వేడుకొంటున్నారు.

ఈనాడు, ఆదిలాబాద్‌- న్యూస్‌టుడే, ఇంద్రవెల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు