కనుల పండువగా పెద్దాపూర్‌ బోనాల జాతర

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌ గ్రామం బోనాలతో జనసంద్రంగా మారింది. మల్లన్న జాతరలో ప్రధాన ఘట్టమైన బోనాల వేడుక కనుల పండువగా సాగింది.

Published : 01 Apr 2024 04:53 IST

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌ గ్రామం బోనాలతో జనసంద్రంగా మారింది. మల్లన్న జాతరలో ప్రధాన ఘట్టమైన బోనాల వేడుక కనుల పండువగా సాగింది. ఆదివారం సాయంత్రం సుమారు 70 వేలకు పైగా భక్తులు స్వామివారికి బోనాలను సమర్పించారు. డప్పుచప్పుళ్లు, శివసత్తుల నృత్యాలు, పోతురాజుల విన్యాసాల నడుమ ఆలయం మల్లన్న నామస్మరణతో మారుమోగింది. పొరుగు రాష్ట్రాల నుంచి జాతరకు పెద్దఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి.

న్యూస్‌టుడే, మెట్‌పల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని