వాలంతరి డీజీగా మురళీకృష్ణ

వాలంతరి డైరెక్టర్‌ జనరల్‌గా నీటిపారుదల శాఖ ఎస్‌ఈ ఎస్‌.మురళీకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 02 Apr 2024 05:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: వాలంతరి డైరెక్టర్‌ జనరల్‌గా నీటిపారుదల శాఖ ఎస్‌ఈ ఎస్‌.మురళీకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓ అండ్‌ ఎం, క్వాలిటీ సెల్‌లో ఎస్‌ఈగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల డీజీగా ఉన్న రమేష్‌ ఆకస్మికంగా కన్నుమూయడంతో ఈ పోస్టు ఖాళీ ఏర్పడింది.

రాజీనామా సమర్పించిన ఎస్‌ఈ కోటేశ్వరరావు!

నీటిపారుదల శాఖలో అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం పర్యవేక్షక ఇంజినీరు(ఎస్‌ఈ)గా విధులు నిర్వహిస్తున్న కోటేశ్వరరావు తన పదవికి రాజీనామా సమర్పించినట్లు తెలిసింది. 2020లో ఆయన పదవీ విరమణ చేయగా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పదవిలో కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఆయన కొనసాగుతూ వస్తున్నారు. మరోవైపు మార్చి 31తో పదవీ కాలం ముగిసిన నాగర్‌కర్నూల్‌ సీఈ హమీద్‌ఖాన్‌ను తిరిగి కొనసాగించేందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదల కాలేదు. 2020 మార్చి 31తో ఆయన పదవీకాలం ముగియగా ప్రభుత్వం సర్వీసును పొడిగించింది. ఈ స్థానంలో కొత్తవారి నియామకానికి సంబంధించిన దస్త్రం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని