అసత్యాలతో నమోదైన కేసులను కొట్టి వేయండి

వ్యక్తిగత కక్ష.. అసత్య ఆరోపణలతో మార్చి 27న తమపై నమోదు చేసిన పోలీసు కేసులను కొట్టివేయాలని కోరుతూ భాజపా నేత, ఎంపీ బండి సంజయ్‌, మరో అయిదుగురు హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు.

Published : 02 Apr 2024 03:01 IST

హైకోర్టులో బండి సంజయ్‌ పిటిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: వ్యక్తిగత కక్ష.. అసత్య ఆరోపణలతో మార్చి 27న తమపై నమోదు చేసిన పోలీసు కేసులను కొట్టివేయాలని కోరుతూ భాజపా నేత, ఎంపీ బండి సంజయ్‌, మరో అయిదుగురు హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. నాచారం పోలీసు అధికారి ఎ.నందీశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఉప్పల్‌, మేడిపల్లి ఠాణాల్లో ఈ కేసులు నమోదు చేశారన్నారు. హోలీ సందర్భంగా పిట్టలబస్తీలో జరిగిన గొడవలో బాధితులను పరామర్శించడానికి తాము వెళ్లగా.. అధికారిని కింద పడేశామని, తద్వారా గాయపడ్డారని కేసు పెట్టారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని, ఈ కేసులను కొట్టి వేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని