ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలను కోరుకున్న భక్తుల ఇళ్లకు చేర్చాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది.

Published : 02 Apr 2024 05:12 IST

రూ.151 ధర నిర్ణయించిన తెలంగాణ ఆర్టీసీ

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలను కోరుకున్న భక్తుల ఇళ్లకు చేర్చాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. దేవాదాయశాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. తలంబ్రాలు కావాల్సిన వారు రాష్ట్రంలోని ఆర్టీసీ లాజిస్టిక్‌ కేంద్రాల్లో రూ.151 చెల్లించిన వివరాలు నమోదు చేసుకోవాలని ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ కోరారు. శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను ఆర్టీసీ బస్‌భవన్‌లో ఆర్టీసీ మేనేజింగ్‌ సజ్జనార్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాజిస్టిక్‌ కేంద్రాలతోపాటు తమ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల నుంచి నేరుగా ఆర్డర్లు స్వీకరిస్తారని తెలిపారు. కావాలనుకున్న వారు ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040 2345 0033, 040 6944 0000, 040 6944 0069 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. పోస్టర్‌ విడుదల కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని