విద్యుత్‌ ఉత్పత్తిలో కేటీపీఎస్‌ జాతీయ రికార్డు

విద్యుత్‌ ఉత్పత్తిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌) సత్తా చాటింది.

Published : 02 Apr 2024 05:12 IST

పాల్వంచ, న్యూస్‌టుడే:  విద్యుత్‌ ఉత్పత్తిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌) సత్తా చాటింది. కర్మాగారానికి చెందిన 12వ యూనిట్‌ ‘2023-24’ వార్షిక సంవత్సరంలో 85.54 శాతం ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌తో దేశంలోనే రెండో స్థానంలో నిలిచినట్లు నేషనల్‌ పవర్‌ ప్రాజెక్టు(ఎన్‌పీపీ) సోమవారం వెల్లడించింది. ఒడిశాకు చెందిన దార్లిపల్లి నేషనల్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ 85.62 పీఎల్‌ఎఫ్‌తో స్వల్ప తేడాతో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఏకైక యూనిట్‌ కేటీపీఎస్‌. ఆర్థిక సంవత్సరం (మార్చి 31) ముగిసే నాటికి మొత్తం 6,011 మిలియన్‌ యూనిట్లను ఇది గ్రిడ్‌కు సరఫరా చేసింది. విద్యుత్‌ ఉత్పత్తికి గాను 30,45,889 మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వలను వినియోగించారు.  ఉత్తమ విధానాలు, ఇంజినీర్ల సమష్టి కృషి, జెన్‌కో సహకారంతో ఈ ఘనత సాధించామని కర్మాగారం ముఖ్య ఇంజినీరు పాలకుర్తి వెంకటేశ్వరరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని