సాగర్‌ ఎడమకాలువకు నీటి విడుదల

రాష్ట్రంలోని జలాశయాల్లో ఏ మేరకు నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరా తీశారు.

Published : 02 Apr 2024 03:37 IST

జలాశయాల్లో నిల్వలపై మంత్రి ఉత్తమ్‌ ఆరా

ఈనాడు, హైదరాబాద్‌, నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని జలాశయాల్లో ఏ మేరకు నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరా తీశారు. సోమవారం హైదరాబాద్‌లోని శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధకు వచ్చిన మంత్రి అందుబాటులో ఉన్న ఈఎన్సీలు, పలువురు సీఈలతోపాటు శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌తో చర్చించారు. అందిన సమాచారం మేరకు.. నాగార్జునసాగర్‌ కింద తాగునీటి అవసరాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. కనీసం వెయ్యి క్యూసెక్కుల చొప్పున కొన్ని రోజులు నీటిని విడుదల చేస్తేనే అవసరాలు తీరుతాయని చర్చించారు. అవసరాన్నిబట్టి సాగర్‌ నుంచి నీటిని విడుదల చేయాలని మంత్రి సూచించారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం తరువాత నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటి విడుదలను అధికారులు ప్రారంభించారు. ఈ జలాలు నల్గొండ నుంచి సూర్యాపేట మీదుగా ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయానికి చేరుకోనున్నాయి. రాత్రి సమయానికి నీటి విడుదలను 2500 క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని