సరికొత్త రికార్డు నెలకొల్పిన సింగరేణి

బొగ్గు ఉత్పత్తి, వార్షిక టర్నోవర్‌లో సింగరేణి సరికొత్త రికార్డులు సృష్టించింది. గత నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరం(2023-24)లో సంస్థ చరిత్రలోనే అత్యధికంగా 7.2 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది.

Published : 02 Apr 2024 03:38 IST

తొలిసారి 7 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి

ఈనాడు, హైదరాబాద్‌: బొగ్గు ఉత్పత్తి, వార్షిక టర్నోవర్‌లో సింగరేణి సరికొత్త రికార్డులు సృష్టించింది. గత నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరం(2023-24)లో సంస్థ చరిత్రలోనే అత్యధికంగా 7.2 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. వివిధ పరిశ్రమలకు 6.9 కోట్ల టన్నులు సరఫరా చేసింది. గతేడాది(2022-23)లో ఉత్పత్తి 6.71 కోట్ల టన్నులు, సరఫరా 6.66 కోట్ల టన్నులతో పోలిస్తే ఉత్పత్తిలో 4.3, సరఫరాలో 4.8 శాతం వృద్ధిరేటును సంస్థ నమోదు చేసింది. ఇక బొగ్గు, విద్యుత్‌ అమ్మకాలపై వార్షిక టర్నోవర్‌ రూ.37,420 కోట్లకు చేరింది. గతేడాది టర్నోవర్‌ రూ.33,065 కోట్లతో పోలిస్తే రూ.4,355 కోట్లు అదనంగా పెరిగి 13.2 శాతం రికార్డు వృద్ధిరేటును నమోదు చేసింది. లాభాలు రూ.2,500 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 1200 మెగావాట్ల విద్యుత్కేంద్రంలో సైతం 90 శాతం వరకూ ఉత్పత్తిని సాధించినట్లు సమాచారం. నికరలాభం ఎంత వచ్చిందనేది సంస్థ కొద్దిరోజుల్లో అధికారికంగా వెల్లడించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని