కొలాంగూడకు పైపులైన్‌ ఏర్పాటుకు చర్యలు

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం గట్టెపల్లి పంచాయతీ పరిధిలోని కొలాంగూడకు పంచాయతీ ట్యాంకరుతో సోమవారం తాగునీటిని సరఫరా చేశారు.

Published : 02 Apr 2024 03:40 IST

తాత్కాలికంగా ట్యాంకరుతో నీటి సరఫరా
‘ఈనాడు’ కథనానికి స్పందన

ఇంద్రవెల్లి, న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం గట్టెపల్లి పంచాయతీ పరిధిలోని కొలాంగూడకు పంచాయతీ ట్యాంకరుతో సోమవారం తాగునీటిని సరఫరా చేశారు. దీంతోపాటు సమస్య శాశ్వత పరిష్కారానికి గ్రామానికి పైపులైన్‌ ఏర్పాటుకు కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశాలు జారీ చేశారు. ‘గుక్కెడు నీటి కోసం 40 అడుగుల లోతున సాహసం’ శీర్షికన ‘ఈనాడు’లో సోమవారం ప్రచురితమైన కథనానికి గ్రామీణ తాగునీటి సరఫరాశాఖ అధికారులతోపాటు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా, కలెక్టర్‌ రాజర్షి షాలు స్పందించారు. తాగునీటి సమస్యపై వెంటనే నివేదిక అందజేయాలని డివిజన్‌, మండలస్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రమేశ్‌, ఏటీడబ్ల్యూఓ క్రాంతికుమార్‌, ఆర్‌ఐ లక్ష్మణ్‌ గ్రామాన్ని సందర్శించారు. టేకిడిగూడ నుంచి కొలాంగూడ వరకు పైపులైన్‌ వేసి నీరందిస్తే తాగునీటి సమస్య తీరుతుందని సెల్‌ఫోన్‌ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. దీంతో మంగళవారం నుంచే పనులు ప్రారంభించాలని ఆయన ఆదేశించినట్లు తహసీల్దారు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని