ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి

రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని ఆసుపత్రుల అసోసియేషన్‌ కోరింది.

Published : 02 Apr 2024 03:44 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని ఆసుపత్రుల అసోసియేషన్‌ కోరింది. సోమవారం మంత్రి దామోదర్‌ రాజనర్సింహను ఆయన నివాసంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.రాకేష్‌, కార్యదర్శి టి.హరిప్రకాశ్‌, ఇతరసభ్యులు కలసి వినతిపత్రం ఇచ్చినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయకపోవడంతో అయిదారు నెలలుగా సిబ్బందికి వేతనాలు చెల్లించలేకపోతున్నామని, వివిధ సంస్థలకు బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరా కూడా ఆగిపోయిందని తెలిపారు. బకాయిల చెల్లింపు, ఆరోగ్యశ్రీ ప్యాకేజీ రేట్లను పెంచాలని, గ్రీన్‌ఛానెల్‌ ద్వారా చెల్లింపులు చేయాలని కోరారు.

అర్హతలేని వైద్యులపై కేసులు...: అర్హత లేకుండానే వైద్యసేవలు అందిస్తున్న 19 ఆసుపత్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ (టీఎస్‌ఎంసీ) ఛైర్మన్‌ మహేశ్‌కుమార్‌, రిజిస్ట్రార్‌ సి.హెచ్‌.హనుమంతరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతలేకున్నా ఫస్ట్‌ఎయిడ్‌ సెంటర్ల పేరుతో వైద్యం అందిస్తున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఆరు క్లినిక్‌లపై ఛార్జిషీట్‌ కూడా ఫైల్‌ అయినట్లు తెలిపారు. 17 మంది వైద్యులపై ఆయుష్‌ బోర్డుకు ఫిర్యాదు చేయగా మరో 20మందికి నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని