బస్‌భవన్‌లో ఏఎస్‌ఆర్‌టీయూ స్టాండింగ్‌ కమిటీ భేటీ

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అసోసియేట్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్టీయూ) స్టాండింగ్‌ కమిటీ సమావేశం మంగళవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో జరిగింది. 18 రాష్ట్రాల ఆర్టీసీలకు చెందిన ఎక్స్‌పర్ట్‌ కమిటీ సభ్యులు హాజరయ్యారు.

Published : 03 Apr 2024 02:58 IST

18 రాష్ట్రాల ఆర్టీసీ ప్రతినిధుల హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అసోసియేట్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్టీయూ) స్టాండింగ్‌ కమిటీ సమావేశం మంగళవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో జరిగింది. 18 రాష్ట్రాల ఆర్టీసీలకు చెందిన ఎక్స్‌పర్ట్‌ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఏఎస్‌ఆర్టీయూ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బస్సుల విడిభాగాల కొనుగోలు పాలసీ, కొత్త వెండర్ల నియామకం అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సజ్జనార్‌ మాట్లాడుతూ.. ఏఎస్‌ఆర్టీయూ సిఫార్సు చేసిన ధరల ప్రకారం కొనుగోలు చేస్తే తక్కువ ధరలకే బస్సుల విడిభాగాలు లభిస్తాయని, కొనుగోళ్లలో పారదర్శకత ఉంటుందని పేర్కొన్నారు. మే నెలలో జరిగే సమావేశంలో స్టాండింగ్‌ కమిటీ ధరలను ఖరారు చేస్తుందని, రెండేళ్లపాటు ఆ ధరలే అమల్లో ఉంటాయని వివరించారు. సమావేశంలో ఏఎస్‌ఆర్టీయూ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సూర్యకిరణ్‌, డైరెక్టర్‌ కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని