పాఠశాల స్థాయి నుంచే పరిశోధనలకు ప్రోత్సాహం

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల పరిశోధనలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

Published : 03 Apr 2024 02:59 IST

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల పరిశోధనలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. హైదరాబాద్‌లోని కళాశాల విద్యాశాఖ, రూసా డైరెక్టరేట్‌ల ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన జిజ్ఞాస ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో డిగ్రీ విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు వీలుగా వారితో అధ్యయన ప్రాజెక్టుల రూపకల్పన కోసం జిజ్ఞాస కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 2023-24 విద్యా సంవత్సరానికిగాను 145 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు చెందిన 5200 మంది విద్యార్థులు అధ్యయన ప్రాజెక్టులు సమర్పించారని, అందులో 290 ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేశామన్నారు. అధ్యయన ప్రాజెక్టుల ప్రదర్శన గురువారం వరకు సాగుతుందని, విజేతలకు బహుమతుల ప్రదానం చేస్తామని, ఉత్తమ ప్రాజెక్టులను జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించేందుకు చర్యలు తీసుకుంటామని వెంకటేశం వివరించారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌, ఏజీవో బాలభాస్కర్‌, జాయింట్‌ డైరెక్టర్లు జి.యాదగిరి, రాజేందర్‌సింగ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని