రాష్ట్రంలో కొత్తగా ఏడు సైబర్‌ పోలీస్‌ స్టేషన్లు

నానాటికీ పెరిగిపోతున్న సైబర్‌ నేరాలను అదుపు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో రాష్ట్రంలో కొత్తగా ఏడు సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్లు ప్రారంభించింది. డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయి.

Published : 03 Apr 2024 02:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: నానాటికీ పెరిగిపోతున్న సైబర్‌ నేరాలను అదుపు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో రాష్ట్రంలో కొత్తగా ఏడు సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్లు ప్రారంభించింది. డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయి. మొదటి రోజైన మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పది కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకూ హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లలో మాత్రమే ప్రత్యేకంగా సైబర్‌ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. కొత్తగా ప్రారంభించిన సైబర్‌ పోలీస్‌స్టేషన్లలో ఒకటి సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలో ఉంటుంది. రాష్ట్రం మొత్తంగా దీని పరిధి ఉంటుంది. వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, సిద్దిపేట, ఖమ్మం, రామగుండం లలో ఈ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని