నిర్మల్‌ జిల్లాలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత

నిర్మల్‌ జిల్లా ఉడుకుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నిర్మల్‌ జిల్లాలో రెండు మండలాల్లో మంగళవారం నమోదయింది.

Published : 03 Apr 2024 03:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మల్‌ జిల్లా ఉడుకుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నిర్మల్‌ జిల్లాలో రెండు మండలాల్లో మంగళవారం నమోదయింది. భైంసా మండలం వానల్‌పహాడ్‌, నర్సాపూర్‌ మండల కేంద్రంలో 43.5 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటాయి. నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 43.4, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనలో 43.4, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 43.3, జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో 43.2, ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అర్లిలో 43 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున రికార్డయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, వనపర్తి జిల్లా కొత్తకోట, రాజన్నసిరిసిల్ల జిల్లా కోనారావుపేట, కామారెడ్డి జిల్లా బిచ్కుంద, నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరులలో 42.8 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదయింది. రానున్న 3 రోజులు పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరుగుతాయని వాతావరణశాఖ సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని