అయోధ్యకు విమాన సర్వీసు ప్రారంభం

శంషాబాద్‌ నుంచి అయోధ్యకు విమాన సర్వీసు మంగళవారం ప్రారంభమైంది. స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ తొలి సర్వీసులో వెళ్తున్న ప్రయాణికులకు విమానాశ్రయ అధికారులు బోర్డింగ్‌ పాస్‌లను అందజేసి స్వాగతం పలికారు.

Published : 03 Apr 2024 03:04 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: శంషాబాద్‌ నుంచి అయోధ్యకు విమాన సర్వీసు మంగళవారం ప్రారంభమైంది. స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ తొలి సర్వీసులో వెళ్తున్న ప్రయాణికులకు విమానాశ్రయ అధికారులు బోర్డింగ్‌ పాస్‌లను అందజేసి స్వాగతం పలికారు. ఈ విమానం మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 10.45 గంటలకు శంషాబాద్‌ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.45 గంటలకు అయోధ్య చేరుకుంటుంది. అదే రోజుల్లో తిరిగి అక్కడి నుంచి మధ్యాహ్నం 1.25 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 3.25 గంటలకు శంషాబాద్‌ చేరుకుంటుంది. ఈ సందర్భంగా విమానాశ్రయ సీఈవో ప్రదీప్‌ ఫణికర్‌ మాట్లాడుతూ అయోధ్యకు విమాన సర్వీసులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని