ప్రైవేట్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాలల సమస్యల పరిష్కారానికి కృషి

రాష్ట్రంలోని ప్రైవేట్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాలల సమస్యలన్నిటినీ మ్యానిఫెస్టో కమిటీతో చర్చించి పరిష్కరిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి, ఏఐసీసీ మ్యానిఫెస్టో కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు.

Published : 03 Apr 2024 03:05 IST

మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రైవేట్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాలల సమస్యలన్నిటినీ మ్యానిఫెస్టో కమిటీతో చర్చించి పరిష్కరిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి, ఏఐసీసీ మ్యానిఫెస్టో కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హామీఇచ్చారు. మంగళవారం గాంధీభవన్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్య సంఘం (టీపీజేఎంఏ) రాష్ట్ర అధ్యక్షులు గౌరి సతీష్‌ ఆధ్వర్యంలో టీపీజేఎంఏ, టీపీడీఎంఏ ప్రతినిధులతో మ్యానిఫెస్టో కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. మ్యానిఫెస్టో కమిటీ సభ్యులు శ్యాంమోహన్‌, కమలాకర్‌, రియాజ్‌, ప్రొ.జానయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు సతీష్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి ప్రైవేట్‌ కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. గత భారాస ప్రభుత్వం విద్యారంగంపై ఎలాంటి ఉన్నతస్థాయి సమీక్షలు చేయకుండా పూర్తిగా నిర్వీర్యం చేసిందని వాపోయారు. అన్ని సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళతానని, త్వరితగతిన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటానని శ్రీధర్‌బాబు వారికి హామీఇచ్చారు. సమావేశంలో టీపీజేఎంఏ రాష్ట్ర కోశాధికారి పార్థసారథి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌, రాష్ట్ర, జిల్లాల ఇన్‌ఛార్జులు, వివిధ కళాశాలల కరెస్పాండెంట్‌లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని