‘బోరు’మన్న చెరువు

నల్గొండ జిల్లా ముషంపల్లి గ్రామంలోని చెరువులో రైతులు వేసిన బోర్లు ఇవి. ఈ చెరువు కింద 150 ఎకరాల ఆయకట్టు ఉంది.

Published : 03 Apr 2024 03:08 IST

నల్గొండ జిల్లా ముషంపల్లి గ్రామంలోని చెరువులో రైతులు వేసిన బోర్లు ఇవి. ఈ చెరువు కింద 150 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో పుష్కలంగా నీరుంటే భూగర్భ జలాలు పెరిగి.. చుట్టుపక్కల ఆరు గ్రామాల్లో బోరు బావుల నుంచి ధారాళంగా నీరువచ్చేది. ప్రస్తుతం ఈ తటాకం అడుగంటిపోవడంతో.. దానికింద ఉన్న ఆయకట్టుతో పాటు సమీపగ్రామాల్లో బోర్లు ఎండిపోయి పంట దెబ్బతింటోంది. ఈ క్రమంలో రైతులు చెరువులో 50కిపైగా బోర్లు వేసి.. పైప్‌లైన్లతో పంటలకు నీరందిస్తున్నారు.

ఈనాడు, నల్గొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని