ఊరును తేల్చిన కరవు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని రాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయంలో నీరు తగ్గడంతో ముంపు గ్రామాలు బయటపడుతున్నాయి.

Published : 03 Apr 2024 03:08 IST

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని రాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయంలో నీరు తగ్గడంతో ముంపు గ్రామాలు బయటపడుతున్నాయి. ఈ జలాశయం నిర్మాణంలో 11 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రస్తుతం జలాశయం నుంచి కుడి, ఎడమ కాలువలకు, దిగువన ఉన్న లోయర్‌ మానేరు డ్యాంకు నీటిని విడుదల చేస్తుండడంతో జలాశయంలో నీరు తగ్గి.. ముంపు గ్రామాల్లోని ఇళ్లు, ఆలయాలు, పాఠశాలలు బయటపడుతున్నాయి. కొదురుపాకలో తేలిన ఇళ్లు, శివాలయాన్ని చిత్రంలో చూడొచ్చు.

న్యూస్‌టుడే, బోయినపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని