శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ

రాష్ట్రంలో శాంతియుతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి వెల్లడించారు.

Updated : 04 Apr 2024 05:34 IST

ఏర్పాట్లపై ఈసీకి వివరించిన సీఎస్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శాంతియుతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్వర్‌ కుమార్‌, డా.సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధులతో కలసి భారత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్‌ కుమార్‌ బుధవారం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు. తెలంగాణ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌, డీజీపీ రవిగుప్తా, ఇతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని సీఎస్‌ శాంతికుమారి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో భాగంగా చేసిన ఏర్పాట్లను అంశాల వారీగా ఈసీకి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని