సీఎం సారూ.. ఉద్యోగాల్లోకి తీసుకోండి

ఉమ్మడి రాష్ట్రంలో తొలగించిన హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ.. వారిలో ఓ హోంగార్డు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Published : 04 Apr 2024 02:46 IST

ఆయన పేరిట లేఖ రాసి హోంగార్డు ఆత్మహత్యాయత్నం

నల్లకుంట, న్యూస్‌టుడే: ఉమ్మడి రాష్ట్రంలో తొలగించిన హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ.. వారిలో ఓ హోంగార్డు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌ నల్లకుంట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా కోడూరు గ్రామానికి చెందిన బురాన్‌గౌడ్‌(40) 2006 నుంచి 2011 వరకు నల్లకుంట ఠాణాలో హోంగార్డుగా పనిచేశాడు. ఆర్డర్‌ కాపీ లేదని అప్పటి ప్రభుత్వం తొలగించిన హోంగార్డుల్లో ఈయన కూడా ఉన్నాడు. సుమారు 250 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ వారు ఉద్యమాలు చేస్తున్నారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి పేరిట ‘సీఎం సార్‌.. మీ కాళ్లు మొక్కుతా. ఇప్పటికైనా కొలువుల్లోకి తిరిగి తీసుకోండి’ అంటూ లేఖ రాశాడు. అనంతరం గుర్తుతెలియని మాత్రలు మింగాడు. ఈ విషయాన్ని తన మిత్రులకు వాట్సప్‌లో పంపడంతో.. కుటుంబికుల సాయంతో వారు గాలించారు. నల్లకుంట పద్మకాలనీలోని ఓ పార్కు వద్ద అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని