హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణకు బెయిల్‌ మంజూరు

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో అరెస్టయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణకు అనిశా కోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

Published : 04 Apr 2024 03:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో అరెస్టయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణకు అనిశా కోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఆయనపై ఏసీబీ అధికారులు దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను తిరస్కరించిన న్యాయస్థానం నిర్ణీత 60 రోజుల్లో ఛార్జిషీట్‌ వేయకపోవడంతో బెయిల్‌ మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. కేసు విచారణ పూర్తయ్యే వరకు దేశం విడిచి వెళ్లరాదని, కోర్టుకు పాస్‌పోర్టును సమర్పించి ఏసీబీ విచారణకు సహకరించాలని పేర్కొంది. ఆయన సోదరుడు శివ నవీన్‌కు సైతం బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో జనవరి 25న శివబాలకృష్ణ అరెస్టయిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని