55 రోజులు.. 133 కేసుల్లో తీర్పులు

కేసుల సత్వర పరిష్కారం దిశగా రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ అడుగులు వేస్తోంది.

Published : 04 Apr 2024 02:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: కేసుల సత్వర పరిష్కారం దిశగా రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ అడుగులు వేస్తోంది. గత మూడు నెలల్లో (సెలవులు, వారాంతాలు 35 రోజులు మినహాయించి 55 రోజుల్లో) 133 కేసులు పరిష్కరించింది. రాష్ట్రంలో వేర్వేరు కమిషన్లలో నమోదయ్యే కేసులతో పోల్చితే రంగారెడ్డి జిల్లా కమిషన్‌లో అత్యధికంగా నమోదవుతుంటాయి. జనవరిలో 52, ఫిబ్రవరి 81, మార్చిలో 73 కలిపి మొత్తం 206 కేసులు నమోదవగా..133 కేసులు పరిష్కారమయ్యాయి. మార్చి నెలాఖరు నాటికి రంగారెడ్డి జిల్లా కమిషన్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 1,405 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేసులు ఎక్కువగా పెండింగ్‌లో ఉండటంతో న్యాయవాదులు మరో అదనపు కమిషన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని