నాలుగు జతల ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు

నాలుగు జతల ప్రత్యేక రైళ్ల సర్వీసులను జూన్‌ ఆఖరివారం వరకు పొడిగిస్తున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది.

Published : 04 Apr 2024 04:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: నాలుగు జతల ప్రత్యేక రైళ్ల సర్వీసులను జూన్‌ ఆఖరివారం వరకు పొడిగిస్తున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. ప్రతి సోమవారం నడిచే కాచిగూడ-మదురై(నం.07191) ఎక్స్‌ప్రెస్‌ను జూన్‌ 24 వరకు, ప్రతి బుధవారం బయల్దేరే మదురై-కాచిగూడ(నం.07192) ఎక్స్‌ప్రెస్‌ను జూన్‌ 26.. శుక్రవారం బయలుదేరే కాచిగూడ-నాగర్‌కోయిల్‌(నం.07435) ఎక్స్‌ప్రెస్‌ను జూన్‌ 28, ఆదివారం బయలుదేరే నాగర్‌కోయిల్‌-కాచిగూడ(నం.07436) జూన్‌ 30 వరకు పొడిగించారు. హెచ్‌ఎస్‌నాందేడ్‌-ఈరోడ్‌-హెచ్‌ఎస్‌నాందేడ్‌, జల్నా-ఛాప్రా-జల్నా.. రైళ్లు కూడా పొడిగించిన వాటిలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని