సమష్టి కృషితో మెరుగైన విద్యుత్తు సరఫరా

వినియోగదారులు, రైతులు, పరిశ్రమలకు మెరుగైన విద్యుత్తు అందించడానికి అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు.

Published : 04 Apr 2024 02:48 IST

ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి

బాలసముద్రం, న్యూస్‌టుడే: వినియోగదారులు, రైతులు, పరిశ్రమలకు మెరుగైన విద్యుత్తు అందించడానికి అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్తు భవన్‌లో బుధవారం 16 జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...132 కేవీ సబ్‌స్టేషన్ల ఏర్పాటు పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. 33, 11 కేవీ ట్రిప్పింగ్స్‌, బ్రేక్‌డౌన్స్‌ అంతరాయాలను గతంతో పోలిస్తే ఈసారి గణనీయంగా తగ్గించగలిగామని, అందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. నిరంతర పర్యవేక్షణతో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని