కృష్ణా ట్రైబ్యునల్‌ కేసు మే 8కి వాయిదా

కృష్ణా ట్రైబ్యునల్‌కు కొత్త విధివిధానాలను నిర్దేశిస్తూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మే 8వ తేదీకి వాయిదా పడింది.

Published : 04 Apr 2024 02:48 IST

ఈనాడు, దిల్లీ: కృష్ణా ట్రైబ్యునల్‌కు కొత్త విధివిధానాలను నిర్దేశిస్తూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మే 8వ తేదీకి వాయిదా పడింది. మార్చి 13న 20వ నంబర్‌లో లిస్ట్‌ అయిన కేసు ప్రస్తుతం 142వ నంబర్‌కు వెళ్లి నేపథ్యంలో త్వరగా విచారించాలని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది జైదీప్‌ గుప్త జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం ముందు బుధవారం ప్రస్తావించారు. ఈ వాదనలను తెలంగాణ తరఫు సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ తోసిపుచ్చారు. వాదనలు విన్న జస్టిస్‌ సూర్యకాంత్‌.. పిటిషన్‌ను మే లేదా జులైలో వింటామని పేర్కొన్నారు. ఏప్రిల్‌లో విచారించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది కోరగా అందుకు అవకాశం లేదని చెప్పి మే 8వ తేదీకి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని