వ్యవసాయ రంగ పరిశోధనలకు ప్రోత్సాహం

వ్యవసాయ రంగంలో రైతులకు లబ్ధి చేకూర్చే విస్తృత పరిశోధనలను ప్రోత్సహిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Updated : 04 Apr 2024 05:31 IST

క్లైమేట్‌ సెన్స్‌ కంపెనీ ప్రతినిధులతో మంత్రి భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయ రంగంలో రైతులకు లబ్ధి చేకూర్చే విస్తృత పరిశోధనలను ప్రోత్సహిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అమెరికాకు చెందిన క్లైమేట్‌ సెన్స్‌ కంపెనీ ప్రతినిధులు జార్జి రేమండ్‌, ఫిలిప్‌ జాక్‌లు మంత్రిని బుధవారం ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పునరుత్పాదక వ్యవసాయం, సేంద్రీయ ఎరువుల వాడకం, వరిలో కర్బన ఉద్గారాలను తగ్గించే పరిశోధనల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. సెన్సార్ల వినియోగంతో వరిసాగు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను వారు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని