మత్తుమందుల నివారణకు కలిసికట్టుగా కృషి చేయాలి: డీజీపీ రవిగుప్తా

రాష్ట్రంలో మాదకద్రవ్యాల నివారణకు కలిసికట్టుగా కృషి చేయాలని డీజీపీ రవిగుప్తా దర్యాప్తు సంస్థలకు పిలుపునిచ్చారు.

Published : 04 Apr 2024 02:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మాదకద్రవ్యాల నివారణకు కలిసికట్టుగా కృషి చేయాలని డీజీపీ రవిగుప్తా దర్యాప్తు సంస్థలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో (టీఎస్‌ న్యాబ్‌) ఆధ్వర్యంలో మత్తుమందుల కేసుల దర్యాప్తు పటిష్ఠంగా జరిగేలా చూసేందుకు శిక్షణ కార్యక్రమం బుధవారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ)లో మొదలైంది. పోలీసులతో పాటు ఆబ్కారీ, సికింద్రాబాద్‌ రైల్వే పోలీస్‌, అదనపు పీపీ, సహాయ పీపీలకు ఈ శిక్షణ నిర్వహించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిరోధానికి టీఎస్‌న్యాబ్‌ అనేక చర్యలు చేపడుతోందని ప్రశంసించారు. ‘25 కంపల్సరీ ఇన్వెస్టిగేషన్‌ టెంప్లెట్స్‌ అండ్‌ 25 మాండేటరీ సీడీ ఫైల్‌ డాక్యుమెంట్స్‌ ఇన్‌ ఎన్డీపీఎస్‌ యాక్ట్‌-1985 కేసెస్‌’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఒకేసారి 2800 మంది అధికారులకు శిక్షణ ఇస్తున్న టీఎస్‌ న్యాబ్‌ అధికారులను డీజీపీ అభినందించారు. బుధవారం మొదలైన ఈ శిక్షణ కార్యక్రమం ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని