ఓటరు చైతన్యంలో కేంద్ర సంస్థల భాగస్వామ్యం

ఓటరు చైతన్యం కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలను భాగస్వాములను చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

Published : 04 Apr 2024 02:57 IST

పోస్టల్‌, రైల్వే, చమురు సంస్థలతో ఈసీఐ ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: ఓటరు చైతన్యం కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలను భాగస్వాములను చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణలోని పోస్టల్‌, రైల్వే శాఖలతో పాటు పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ సంస్థలు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయంలో అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోలింగు శాతాన్ని పెంచేందుకు ఆయా సంస్థల సహకారాన్ని తీసుకోనున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ చెప్పారు. ఆయా సంస్థలకు ఉన్న హోర్డింగులు, డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఓటరు చైతన్యాన్ని పెంపొందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఓటరు చైతన్య ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ డాక్టర్‌ పీవీఎస్‌ రెడ్డి, పోస్టల్‌ శాఖ విజిలెన్స్‌ ఏడీ సంతోష్‌కుమార్‌ నరహరి, పోస్టల్‌ శాఖ ఎస్‌ఎస్‌ఆర్‌ఎం టీఏవీ శర్మ, దక్షిణ మధ్య రైల్వే డిప్యుటీ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ భాస్కర్‌రెడ్డి, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ (రిటైల్‌ సేల్స్‌) ఎన్‌.బాలసుబ్రహ్మణ్యం, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ కె.రవీంద్రరావు, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (రిటైల్‌) కేఎస్‌వీ భాస్కర్‌, ఎన్నికల సంఘం అధికారులు సర్ఫరాజ్‌ అహ్మద్‌, భవానీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని