నీటి ట్యాంకులో పడి 30 వానరాల మృతి

నాగార్జునసాగర్‌ హిల్‌ కాలనీలోని ఓ మంచినీటి ట్యాంకులో కోతులు పడి చనిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హిల్‌కాలనీ విజయవిహార్‌ సమీపంలోని సుమారు రెండు వందల నివాస గృహాలకు తాగునీటి కోసం ఎన్నెస్పీ నీటి సరఫరా విభాగం ట్యాంకును నిర్మించింది.

Updated : 04 Apr 2024 06:50 IST

ఆ నీటినే తాగామని కాలనీవాసుల భయాందోళన

నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ హిల్‌ కాలనీలోని ఓ మంచినీటి ట్యాంకులో కోతులు పడి చనిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హిల్‌కాలనీ విజయవిహార్‌ సమీపంలోని సుమారు రెండు వందల నివాస గృహాలకు తాగునీటి కోసం ఎన్నెస్పీ నీటి సరఫరా విభాగం ట్యాంకును నిర్మించింది. దాహం తీర్చుకోవటానికి ఈ ట్యాంకు వద్దకు వచ్చిన కోతులు అందులోకి దిగాయి. బయటికి రావటానికి అవకాశం లేకపోవటంతో మృత్యువాత పడ్డాయి. బుధవారం ట్యాంకు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు మున్సిపల్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. సుమారు 30 కోతుల వరకు బయటకు తీశారు. ఇన్ని రోజులూ ఆ నీటినే తాగమని, అనారోగ్యానికి గురవుతామేమోనని కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయాల్సిన బాధ్యత మున్సిపల్‌ సిబ్బందికి ఉన్నా.. ఏనాడూ అలాంటి చర్యలు నిర్వహించలేదని స్థానికులు ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని