ప్రపంచ శాంతిని కాంక్షించే రంజాన్‌

ప్రపంచ శాంతిని, ప్రజల శ్రేయస్సును కాంక్షించే పవిత్ర రంజాన్‌ మాసం ముగింపు సందర్భంగా రాష్ట్రంలోని ముస్లింలందరికీ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ‘ఈద్‌-ఉల్‌-ఫితర్‌’ శుభాకాంక్షలు తెలిపారు.

Published : 11 Apr 2024 03:51 IST

గవర్నర్‌, సీఎంల శుభాకాంక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచ శాంతిని, ప్రజల శ్రేయస్సును కాంక్షించే పవిత్ర రంజాన్‌ మాసం ముగింపు సందర్భంగా రాష్ట్రంలోని ముస్లింలందరికీ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ‘ఈద్‌-ఉల్‌-ఫితర్‌’ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఖురాన్‌ బోధనలు, సమాజంపై వాటి ప్రభావం పట్ల తనకు అమిత గౌరవం ఉందని ఆయన పేర్కొన్నారు. మానవ సేవ అత్యున్నతమైనదని చాటి చెప్పే రంజాన్‌ పండుగ లౌకిక వాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ముస్లిం సోదరులకు ఆయన రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల అభ్యున్నతికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. మత సామరస్యానికి తెలంగాణ నిలువెత్తు ప్రతీక అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. భట్టితో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర్‌ రాజనర్సింహ, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

ముస్లిం సోదరులకు కేసీఆర్‌ శుభాకాంక్షలు

రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు భారాస అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆనందంగా రంజాన్‌ జరుపుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని