నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో గురు, శుక్ర వారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Published : 11 Apr 2024 03:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గురు, శుక్ర వారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా పలు జిల్లాల్లో బుధవారం జల్లులు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 41.1, వనపర్తి జిల్లా కొత్తకోటలో 41.1, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రోగొండలో 41, ములుగు జిల్లా తాడ్వాయిలో 41, మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో 40.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు