నేడు గురుగ్రహాన్ని వీక్షించవచ్చు..

భూమికి దగ్గరగా (85 కోట్ల కిలోమీటర్ల దూరంలో) పరిభ్రమిస్తున్న గురు గ్రహాన్ని గురువారం రాత్రి ప్రజలందరూ వీక్షించవచ్చని ప్లానెటరీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌ అధ్యక్షుడు రఘునందన్‌ బుధవారం తెలిపారు.

Published : 11 Apr 2024 03:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: భూమికి దగ్గరగా (85 కోట్ల కిలోమీటర్ల దూరంలో) పరిభ్రమిస్తున్న గురు గ్రహాన్ని గురువారం రాత్రి ప్రజలందరూ వీక్షించవచ్చని ప్లానెటరీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌ అధ్యక్షుడు రఘునందన్‌ బుధవారం తెలిపారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో వేల మంది ఈ గ్రహాన్ని వీక్షించారని వెల్లడించారు. చంద్రుడిపై చిన్న నక్షత్రంలా ఇది కనిపించిందని వివరించారు. గురువారం సూర్యాస్తమయం అయ్యాక 15 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల వరకూ చూడొచ్చని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని