సికింద్రాబాద్‌ నుంచి వేసవి ప్రత్యేక రైళ్లు

వేసవి ప్రత్యేక రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్‌, సాంత్రాగాఛిలకు.. కేరళలోని కొల్లంకు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ. రైల్వే తెలిపింది.

Published : 11 Apr 2024 05:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: వేసవి ప్రత్యేక రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్‌, సాంత్రాగాఛిలకు.. కేరళలోని కొల్లంకు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ. రైల్వే తెలిపింది. ఈ మేరకు బుధవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేసింది. సికింద్రాబాద్‌-సాంత్రాగాఛి(07223) రైలు ప్రతి శుక్రవారం బయల్దేరుతుంది. ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 28 వరకు 11 ట్రిప్పులు వెళుతుంది. ప్రతి శనివారం తిరుగుప్రయాణమయ్యే సాంత్రాగాఛి-సికింద్రాబాద్‌(07224) ప్రత్యేక రైలు ఏప్రిల్‌ 20 నుంచి జూన్‌ 29 వరకు 11 ట్రిప్పులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. రాష్ట్రంలో నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, భువనేశ్వర్‌, కటక్‌, ఖరగ్‌పుర్‌ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

  • సికింద్రాబాద్‌-షాలిమార్‌(07225) ప్రత్యేక రైలు ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 24 వరకు ప్రతి సోమవారం.. షాలిమార్‌-సికింద్రాబాద్‌(07226) రైలు ఏప్రిల్‌ 16 నుంచి జూన్‌ 25 వరకు ప్రతి మంగళవారం బయల్దేరుతాయి. ఈ రైళ్లు కూడా 11 ట్రిప్పులు తిరుగుతాయి. ఈ రైళ్లు రాష్ట్రంలో కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం స్టేషన్లలో ఆగుతాయి. రాయనపాడు, రాజమహేంద్రవరం, దువ్వాడ, భువనేశ్వర్‌, ఖరగ్‌పుర్‌, సాంత్రాగాఛి మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
  • సికింద్రాబాద్‌-కొల్లం మధ్య రానుపోను 22 ట్రిప్పుల ప్రత్యేక రైళ్లను ద.మ. రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌-కొల్లం(07193) ప్రత్యేక రైలు ఏప్రిల్‌ 17, 24, మే 1, 8, 15, 22, 29 జూన్‌ 5, 12, 19, 26 తేదీల్లో బయల్దేరుతుంది. తిరుగుప్రయాణంలో కొల్లం-సికింద్రాబాద్‌(07194) రైలు ఏప్రిల్‌ 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్‌ 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రాష్ట్రంలోని నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతుంది. గుంటూరు, ఒంగోలు, రేణిగుంట, కాట్పాడి, ఈరోడ్‌, కోయంబత్తూరు, ఎర్నాకుళం, కొట్టాయం, కాయంకుళం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని