ఏపీలో గ్రూపు-2 ప్రిలిమ్స్‌ ఫలితాల వెల్లడి

ఏపీపీఎస్సీ బుధవారం గ్రూపు-2 ప్రిలిమ్స్‌ ఫలితాలను ప్రకటించింది. వచ్చే జులై 28న జరిగే ప్రధాన పరీక్ష రాసేందుకు 92,250 మందికి అవకాశాన్ని కల్పించింది.

Published : 11 Apr 2024 03:54 IST

1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
ప్రధాన పరీక్షకు 92,250 మందికి అవకాశం

ఈనాడు-అమరావతి: ఏపీపీఎస్సీ బుధవారం గ్రూపు-2 ప్రిలిమ్స్‌ ఫలితాలను ప్రకటించింది. వచ్చే జులై 28న జరిగే ప్రధాన పరీక్ష రాసేందుకు 92,250 మందికి అవకాశాన్ని కల్పించింది. ఒక్కొక్క పోస్టుకు 100 మంది చొప్పున ఎంపిక చేసింది. ప్రిలిమ్స్‌లో పలువురు అభ్యర్థులకు మార్కులు సమానంగా వచ్చాయి. దీనివల్ల ప్రధాన పరీక్ష రాసేవారి సంఖ్య పెరిగింది. దీంతో ప్రధాన పరీక్షకు ప్రిలిమ్స్‌ నుంచి 1:50లో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని నిరుద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని