రంజాన్‌ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ తన నివాసంలో గురువారం రంజాన్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Published : 12 Apr 2024 03:46 IST

మంత్రులు, నాయకులకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ విందు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ తన నివాసంలో గురువారం రంజాన్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉదయం దిల్లీకి వెళ్లే ముందు ఇక్కడి పండగ సంబరాల్లో పాల్గొని షీర్‌కుర్మా స్వీకరించారు. తరువాత మధ్యాహ్నం అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, సియాసత్‌ ఉర్దూ దినపత్రిక సంపాదకుడు ఆమిర్‌ అలీ సహా దాదాపు 150 మంది ప్రముఖులు హాజరై విందు స్వీకరించారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ..లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించలేక తన నివాసంలో సన్నిహితులు, కుటుంబసభ్యులతో వేడుకలు నిర్వహించామన్నారు. రాష్ట్రంలో రంజాన్‌ ప్రార్థనలు నెలరోజుల పాటు ప్రశాంతంగా నిర్వహించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని