ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నియామకం

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణ వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను నియమించింది.

Published : 12 Apr 2024 03:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణ వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను నియమించింది. ఈ మేరకు  సీనియర్‌ న్యాయవాది సాంబశివారెడ్డిని నియమిస్తూ జీఓ జారీ చేసింది. ఆ జీవో ఆధారంగా హైదరాబాద్‌ పోలీసులు నాంపల్లి అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో మెమో దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం ఈ నెల 15న నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్‌రావుకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో సెక్షన్‌ 70 ఐటీ యాక్ట్‌ సహా మరో రెండు సెక్షన్లు ఉండటంతో బెయిల్‌ పిటిషన్‌ను సెషన్స్‌ కోర్టుకు బదిలీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని