గిజిగాడికి గూడు.. సంకల్పమే తోడు

పచ్చని చెట్లు, వాటిపై పక్షుల గూళ్లు, నీటి కుండీలు చూసి ఇవి పార్కులోని దృశ్యాలనుకుంటే పొరపాటే.. రేడియేషన్‌, ఇతర కారణాలతో అంతరించిపోతున్న పిచ్చుకలు, పక్షులను సంరక్షించేందుకు తన వంతుగా కృషి చేయాలని భావించి.. వాటికి తన ఇంట్లో ఆవాసాలు ఏర్పాటు చేశారు

Published : 12 Apr 2024 03:52 IST

పచ్చని చెట్లు, వాటిపై పక్షుల గూళ్లు, నీటి కుండీలు చూసి ఇవి పార్కులోని దృశ్యాలనుకుంటే పొరపాటే.. రేడియేషన్‌, ఇతర కారణాలతో అంతరించిపోతున్న పిచ్చుకలు, పక్షులను సంరక్షించేందుకు తన వంతుగా కృషి చేయాలని భావించి.. వాటికి తన ఇంట్లో ఆవాసాలు ఏర్పాటు చేశారు నిజామాబాద్‌ వినాయక్‌నగర్‌లోని కొత్త హౌసింగ్‌ బోర్డుకు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి అందె జీవన్‌రావు.

వేరే ప్రాంతాల్లో పక్షులు వదిలిపెట్టిన గూళ్లను తీసుకొచ్చి.. తన ఇంట్లోని చెట్ల కొమ్మలకు ఏర్పాటు చేస్తున్నారు. వాడి పడేసిన హెల్మెట్లు, ప్లాస్టిక్‌ మూతలు, ఇతర వస్తువులనూ పక్షులకు ఆవాసానికి వీలుగా మార్చారు. వీటిలో ఆహారపు గింజలు పెట్టడంతో పాటు తాగునీరూ పోస్తున్నారు. తమ ఇంట్లోని సుమారు 30 గూళ్లలో 50-60 ఊరపిచ్చుకలు, చిన్నపక్షులు, రామచిలుకలు వంటివి ఆవాసం ఏర్పర్చుకున్నాయని జీవన్‌రావు తెలిపారు.

 ఈనాడు, నిజామాబాద్‌, న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని