మే 29, 30లలో బాల సాహిత్య సమ్మేళనం

తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో మే 29, 30న హైదరాబాద్‌లో ‘బాల సాహిత్య సమ్మేళనం’ నిర్వహించనున్నారు.

Published : 13 Apr 2024 04:34 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో మే 29, 30న హైదరాబాద్‌లో ‘బాల సాహిత్య సమ్మేళనం’ నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పాఠశాలల విద్యార్థులు, తెలుగు ఉపాధ్యాయులు, బాల సాహితీవేత్తలు సమ్మేళనంలో పాల్గొంటారని పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జుర్రు చెన్నయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల స్థాయిలో తెలుగు భాషావికాసం, రచనాభిరుచి పెంపొందించడం, కథలు చెప్పడంలో మెలకువలు, సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం వంటి అంశాలపై సదస్సులు, చర్చాగోష్ఠులు ఉంటాయన్నారు. ప్రతినిధులుగా పాల్గొనాలనుకున్న వారు ఈ నెల 30 లోపు వాట్సాప్‌ నంబరు 96037 27234 కు వివరాలు పంపి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని