చెక్‌ బౌన్స్‌ కేసులను ఎదుర్కోవాల్సిందే

డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (డీసీహెచ్‌ఎల్‌) నిర్వహణ కోసం తీసుకున్న రుణాల చెల్లింపులో భాగంగా ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో అధీకృత సంతకందారు, డైరెక్టర్లు, వ్యక్తిగత హామీదారులుగా టి.వెంకట్రామ్‌రెడ్డి, టి.వినాయక్‌ రవిరెడ్డి చెక్‌ బౌన్స్‌ కేసును ఎదుర్కోవాల్సిందేనని ఇటీవల హైకోర్టు స్పష్టంచేసింది.

Published : 13 Apr 2024 04:35 IST

డీసీహెచ్‌ఎల్‌ వ్యవహారంలో హైకోర్టు తీర్పు

ఈనాడు, హైదరాబాద్‌: డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (డీసీహెచ్‌ఎల్‌) నిర్వహణ కోసం తీసుకున్న రుణాల చెల్లింపులో భాగంగా ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో అధీకృత సంతకందారు, డైరెక్టర్లు, వ్యక్తిగత హామీదారులుగా టి.వెంకట్రామ్‌రెడ్డి, టి.వినాయక్‌ రవిరెడ్డి చెక్‌ బౌన్స్‌ కేసును ఎదుర్కోవాల్సిందేనని ఇటీవల హైకోర్టు స్పష్టంచేసింది. డీసీహెచ్‌ఎల్‌ దివాలా పరిష్కారంలో భాగంగా రుణ పరిష్కార ప్రణాళికకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ అనుమతించిందన్న కారణంగా కేసును కొట్టివేయలేమని తేల్చిచెప్పింది. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.350 కోట్లు, కెనరా బ్యాంకు నుంచి రూ.150 కోట్లు, యాక్సిస్‌ బ్యాంకు నుంచి రూ.100 కోట్ల రుణాలకు సంబంధించి బకాయిల చెల్లింపులో భాగంగా ఇచ్చిన చెక్‌లు చెల్లకుండా పోవడంతో టి.వెంకట్రామ్‌రెడ్డి, టి.వినాయక్‌ రవిరెడ్డిలపై బ్యాంకులు కేసులు నమోదు చేశాయి. వాటిని కొట్టివేయాలంటూ హైకోర్టులో వేర్వేరుగా మూడు పిటిషన్‌లు దాఖలుచేశారు. వాటిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్లు చెక్‌బౌన్స్‌ కేసులను ఎదుర్కోవాల్సిందేనంటూ పిటిషన్‌లను కొట్టివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని