యూజీసీ సభ్యుడిగా సచ్చిదానంద మొహంతి

కేంద్ర ఉన్నత విద్యాశాఖలో అంతర్భాగమైన యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) సభ్యులుగా హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) ఆచార్యులు సచ్చిదానంద మొహంతి నియమితులయ్యారు.

Published : 13 Apr 2024 04:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ఉన్నత విద్యాశాఖలో అంతర్భాగమైన యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) సభ్యులుగా హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) ఆచార్యులు సచ్చిదానంద మొహంతి నియమితులయ్యారు. 2024 ఏప్రిల్‌ 10 నుంచి మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా సమాచారం అందిందని ప్రొఫెసర్‌ సచ్చిదానంద మొహంతి శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం ఆయన ఛండీగఢ్‌లోని పంజాబ్‌ విశ్వవిద్యాలయం అరబిందో ఛైర్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని