హనుమకొండ జిల్లాలో.. సొరంగ మార్గంపై గూడ్స్‌ రైలు పరుగులు

హనుమకొండ జిల్లా వడ్డేపల్లి రైల్వే కొత్తవంతెన (ఉనికిచెర్ల మార్గం) సమీపంలో నిర్మిస్తున్న సొరంగం పైనుంచి శుక్రవారం గూడ్సు రైలును విజయవంతంగా నడిపించారు.

Updated : 13 Apr 2024 09:55 IST

కాజీపేట, న్యూస్‌టుడే: హనుమకొండ జిల్లా వడ్డేపల్లి రైల్వే కొత్తవంతెన (ఉనికిచెర్ల మార్గం) సమీపంలో నిర్మిస్తున్న సొరంగం పైనుంచి శుక్రవారం గూడ్సు రైలును విజయవంతంగా నడిపించారు. హసన్‌పర్తి నుంచి కాజీపేటకు వచ్చే రైళ్లు నేరుగా రావడానికి రూ.36 కోట్లతో టన్నెల్‌ నిర్మాణం చేపట్టారు. హసన్‌పర్తి రోడ్డు నుంచి వరంగల్‌ వైపు వెళ్లే రైళ్లు టన్నెల్‌ పైభాగం నుంచి నేరుగా వెెళతాయి. హసన్‌పర్తి రోడ్డు నుంచి కాజీపేటకు వచ్చే రైళ్లు మాత్రం టన్నెల్‌ ద్వారా వడ్డేపల్లి చెరువు పక్క నుంచి కాజీపేటకు వస్తాయి. వారం రోజులుగా ఇంజినీరింగ్‌, ఎస్‌అండ్‌టీ, ఆపరేటింగ్‌, ఓహెచ్‌ఈ విభాగాల అధికారులు, సిబ్బంది టన్నెల్‌ పైభాగాన ఉన్న పాత రైలు పట్టాలను తొలగించి.. వాటి స్థానంలో కొత్త ట్రాక్‌ వేస్తున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హసన్‌పర్తి- వరంగల్‌ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేసి విద్యుత్తు తీగలను మార్చారు. మధ్యాహ్నం 12.50 గంటలకు హసన్‌పర్తి రోడ్డు నుంచి పూర్తిస్థాయి లోడ్‌తో గూడ్సు రైలును కొత్త ట్రాక్‌ మీదుగా విజయవంతంగా నడిపారు. 1140 మీటర్ల పొడవైన ట్రాక్‌లో 340 మీటర్ల పనులు పూర్తయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని