జేఈఈ మెయిన్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల

జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 ప్రాథమిక ‘కీ’ని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసింది.

Published : 14 Apr 2024 03:30 IST

అభ్యంతరాలకు నేటి రాత్రి వరకు గడువు

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 ప్రాథమిక ‘కీ’ని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసింది. వాటిపై అభ్యంతరాలుంటే ఒక్కో ప్రశ్నకు రూ.200 చెల్లించి సవాల్‌ చేయవచ్చని పేర్కొంది. అందుకు ఈనెల 14వ తేదీ రాత్రి 11 గంటల వరకు గడువు ఇచ్చింది. అభ్యంతరాలను నిపుణులు పరిశీలించిన తర్వాత ర్యాంకులు కేటాయిస్తారు. ఈ నెల 25న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని