నెర్రలు బారిన మూసీ

గతేడాది మే నెలలోనూ నిండుకుండను తలపించిన మధ్యతరహా ప్రాజెక్టు మూసీ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే నెర్రలుబారుతోంది.

Published : 14 Apr 2024 03:34 IST

గతేడాది మే నెలలోనూ నిండుకుండను తలపించిన మధ్యతరహా ప్రాజెక్టు మూసీ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే నెర్రలుబారుతోంది. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఈ ప్రాజెక్టు కింద 33 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. దీని పరిధిలోని కుడి, ఎడమకాల్వల కింద ఈ ఏడాది రెండు పంటలకూ నీళ్లందించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.38 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. జలాశయంలో నీటిమట్టం తగ్గడంతో పరీవాహకంలోని బోరుబావులు వట్టిపోతున్నాయి. 1990లో చివరిసారిగా ఈ ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

ఈనాడు, నల్గొండ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు