మేడిగడ్డ బ్యారేజీలో సాంకేతిక పరీక్షలు

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో 20వ పియర్‌ కుంగి దెబ్బతిన్న నేపథ్యంలో 6, 7, 8 బ్లాక్‌లలో ఇటీవల పలు సాంకేతిక పరీక్షలను నిర్వహించారు.

Published : 14 Apr 2024 03:35 IST

మహదేవపూర్‌, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో 20వ పియర్‌ కుంగి దెబ్బతిన్న నేపథ్యంలో 6, 7, 8 బ్లాక్‌లలో ఇటీవల పలు సాంకేతిక పరీక్షలను నిర్వహించారు. ఈ క్రమంలో మిగతా బ్లాక్‌లలో పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో పరీక్షలు నిర్వహించేందుకు నిర్మాణ సంస్థ, సంబంధిత అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈఆర్‌ (ఎలక్ట్రో రెసిస్టివిటీ టెస్ట్‌), జియో ఫిజికల్‌ పద్దతిలో జీపీఆర్‌ టెస్ట్‌ వంటి సాంకేతిక పరీక్షలను చేపట్టనున్నారు. 1 నుంచి 5 వరకు బ్లాక్‌లలో వాహనాలు, యంత్రాలు, సాంకేతిక పరికరాలు తీసుకెళ్లడానికి వీలుగా రోడ్డు పనులను పూర్తిచేశారు. ఆయా ప్రదేశాలను పరీక్షల నిర్వహణకు సిద్ధంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని