ఉప్పలమ్మా... నీ తెగువకు వందనం

ఓ సామాన్య మహిళ చూపిన తెగువ ముగ్గురు బాలికల ప్రాణాలను కాపాడింది. అప్పటికే ఒక బాలిక నీట మునిగి దుర్మరణం చెందింది.

Published : 14 Apr 2024 05:09 IST

ముగ్గురు బాలికల ప్రాణాలను కాపాడిన మహిళ
అప్పటికే నీట మునిగి ఓ బాలిక దుర్మరణం

నెహ్రూసెంటర్‌, న్యూస్‌టుడే: ఓ సామాన్య మహిళ చూపిన తెగువ ముగ్గురు బాలికల ప్రాణాలను కాపాడింది. అప్పటికే ఒక బాలిక నీట మునిగి దుర్మరణం చెందింది. ఈ ఘటన మహబూబాబాద్‌ పట్టణ శివారు గౌతమబుద్ధ కాలనీలో శనివారం జరిగింది. స్థానికులు, పట్టణ సీఐ పెండ్యాల దేవేందర్‌ తెలిపిన వివరాల మేరకు.. కురవి మండలం బంచరాయితండాకు చెందిన బోడ వీరన్న, కుమారి దంపతులు మూడేళ్ల నుంచి పట్టణంలోని గౌతమబుద్ధ కాలనీలో గుడిసె వేసుకొని ఉంటున్నారు. శనివారం వారు కూలి పనులకు వెళ్లగా ముగ్గురు కుమార్తెలు అనూష, నిఖిత (11), గౌతమి, వీరన్న సోదరుని కుమార్తె శృతి సమీపంలోని ఓ క్వారీ నీటి గుంతలో దుస్తులు ఉతుక్కునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నలుగురు నీళ్లలోకి జారిపోయారు. వారి ఆర్తనాదాలు విని సమీపంలోనే ఓ గుడిసెలో నివసించే మహిళ నెరుసు ఉప్పలమ్మ అక్కడకు చేరుకుంది.

క్వారీ గుంతలోకి దిగి నీటిలో మునుగుతున్న అనూష, శృతి, గౌతమిలను ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడారు. వీరన్న రెండో కుమార్తె నిఖిత మాత్రం అప్పటికే గుంత మధ్యలోకి వెళ్లి నీటి అడుగుకి చేరిపోవడంతో బయటకు తీయలేకపోయింది. చుట్టుపక్కల వారు వచ్చి వెలికితీయగా అప్పటికే ఆమె చనిపోయింది. నిఖిత బంచరాయి తండాలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ముగ్గురు పిల్లలను కాపాడిన మహిళ ఉప్పలమ్మను స్థానికులు, పోలీసులు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు