విద్యాభివృద్ధిపై ఉపకులపతుల జాతీయస్థాయి సదస్సు

దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ఉప కులపతులతో శామీర్‌పేట లియోనియాలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు ‘ఉన్నత విద్యలో సాధించిన ప్రగతి-భవిష్యత్‌లో సాధించాల్సిన అభివృద్ధి’ అంశంపై జాతీయస్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌-(ఏఐయూ) అధ్యక్షుడు జీడీ శర్మ వివరించారు.

Published : 15 Apr 2024 03:25 IST

వికసిత్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా సమావేశం
నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహణ

శామీర్‌పేట, న్యూస్‌టుడే: దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ఉప కులపతులతో శామీర్‌పేట లియోనియాలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు ‘ఉన్నత విద్యలో సాధించిన ప్రగతి-భవిష్యత్‌లో సాధించాల్సిన అభివృద్ధి’ అంశంపై జాతీయస్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌-(ఏఐయూ) అధ్యక్షుడు జీడీ శర్మ వివరించారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..వికసిత్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథిగా రాష్ట్ర ఇన్‌ఛార్జి  గవర్నర్‌ రాధాకృష్ణన్‌ హాజరవుతారని వెల్లడించారు. దేశ, విదేశాలకు చెందిన వివిధ యూనివర్సిటీల ఉపకులపతులు 500 మంది హాజరవుతారని అన్నారు. 2047 నాటికి ఉన్నత విద్యా రంగంలో అభివృద్ధిని సాధించి దేశ ప్రగతి మరింత పెంపొందించే లక్ష్యంతో చర్చలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆచార్యులు ఎల్‌ఎస్‌ గణేశ్‌, ఎ.మహేందర్‌రెడ్డి, జి.మాధవి, పంకజ్‌మిట్టల్‌, వినయ్‌కుమార్‌ పాఠక్‌, సుధాకర్‌రావు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని