గురుకులాల్లో రాత్రి విధుల ఆదేశాలు రద్దు చేయాలి

రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో ఉపాధ్యాయులను రాత్రివేళ పాఠశాలలోనే ఉంటూ విధులు నిర్వహించాలని ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలని తెలంగాణ ఎస్సీ గురుకుల ఉపాధ్యాయులు, ఉద్యోగుల సంఘం (టీఎస్‌డబ్ల్యూఆర్‌టీఈఏ) డిమాండ్‌ చేసింది.

Published : 15 Apr 2024 03:25 IST

టీఎస్‌డబ్ల్యూఆర్‌టీఈఏ డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో ఉపాధ్యాయులను రాత్రివేళ పాఠశాలలోనే ఉంటూ విధులు నిర్వహించాలని ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలని తెలంగాణ ఎస్సీ గురుకుల ఉపాధ్యాయులు, ఉద్యోగుల సంఘం (టీఎస్‌డబ్ల్యూఆర్‌టీఈఏ) డిమాండ్‌ చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలపై శాస్త్రీయ అధ్యయనం చేసి, నివారణ చర్యలు చేపట్టాలని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలరాజు, దయాకర్‌ డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు బోధనేతర కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తున్నారని, తక్కువ సమయంలో సిలబస్‌ పూర్తిచేయడంతో పాటు నూరుశాతం ఫలితాలు సాధించాలన్న కార్యక్రమాలతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. గురుకుల ఉపాధ్యాయులకు నైట్‌డ్యూటీ విధులు అప్పగించడం సరికాదని, రాత్రి విధులు నిర్వహించిన టీచర్లు ఉదయం పాఠాలు ఎలా బోధించగలరని ప్రశ్నించారు. గురుకులాల్లో వాచ్‌మెన్ల సంఖ్య పెంచాలని, టీచర్లు కేవలం బోధన విధులకు పరిమితం చేయాలని డిమాండ్‌చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని