వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసుల సోదాలు

అప్పులిచ్చి అధిక వడ్డీలు గుంజుతున్న వడ్డీ వ్యాపారుల ఇళ్లలో మల్టీజోన్‌-1 పోలీసులు సోదాలు నిర్వహించి పెద్దమొత్తంలో ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

Published : 15 Apr 2024 03:25 IST

ఈనాడు, హైదరాబాద్‌: అప్పులిచ్చి అధిక వడ్డీలు గుంజుతున్న వడ్డీ వ్యాపారుల ఇళ్లలో మల్టీజోన్‌-1 పోలీసులు సోదాలు నిర్వహించి పెద్దమొత్తంలో ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మల్టీజోన్‌-1 ఐజీ రంగనాథ్‌ ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఇలాంటి వడ్డీ వ్యాపారం చట్ట విరుద్ధం. ప్రజల నగలు, ఇళ్లు సహా ఇతర ఆస్తిపత్రాల వంటివి తనఖా పెట్టుకొని అధిక వడ్డీకి అప్పులిస్తున్నారు. తిరిగి చెల్లించని పక్షంలో వారి ఆస్తులను జప్తు చేస్తున్నారు. ఇలాంటి వారి ఆగడాలు మితిమీరుతున్నట్టు ఫిర్యాదులు అధికమవుతున్న నేపథ్యంలో పలువురు వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాం. సోదాల్లో పెద్దమొత్తంలో నగదు, ప్రామిసరీ నోట్లు, భూవిక్రయ పత్రాలు, పట్టాదారు పాసుపుస్తకాలు, చెక్కులు, ఏటీఎం కార్డుల వంటివాటిని స్వాధీనం చేసుకున్నాం’ అని ఆ ప్రకటనలో ఐజీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని