ఐఐటీల్లో బీఈడీ ప్రవేశాలకు ఎన్‌సీఈటీ నోటిఫికేషన్‌

ప్రతిష్ఠాత్మక ఐఐటీలతోపాటు ఎన్‌ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో బీఈడీ చేయాలన్న ఆసక్తి ఉందా? ఇందుకోసం నేషనల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఎన్‌సీఈటీ) నోటిఫికేషన్‌ను జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) జారీ చేసింది.

Published : 15 Apr 2024 03:26 IST

దేశవ్యాప్తంగా 6,100 సీట్లు
జూన్‌ 12న ప్రవేశ పరీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక ఐఐటీలతోపాటు ఎన్‌ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో బీఈడీ చేయాలన్న ఆసక్తి ఉందా? ఇందుకోసం నేషనల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఎన్‌సీఈటీ) నోటిఫికేషన్‌ను జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) జారీ చేసింది. ఇంటర్‌, తత్సమాన విద్యార్హతతో ఇంజినీరింగ్‌, మెడికల్‌, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తుంది. బీఏ-బీఈడీ, బీకాం-బీఈడీ, బీఎస్సీ-బీఈడీ కోర్సులను ప్రవేశపెట్టాయి. ఈ పరీక్షలో ర్యాంకు ఆధారంగా ఆయా సంస్థలు ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లను భర్తీ చేస్తాయని మైసూర్‌లోని ఆర్‌ఐఈ ప్రిన్సిపల్‌ ఆచార్య యజ్ఞమూర్తి శ్రీకాంత్‌ చెప్పారు. కేవలం ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు మాత్రమే ఎన్‌సీఈటీ వర్తిస్తుందని, తమ విద్యాసంస్థలోని ఇతర కోర్సులకు గతంలో మాదిరిగానే ఆర్‌ఐఈ జేఈఈ నిర్వహిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్‌ బీఈడీని 64 విద్యాసంస్థలు అందిస్తున్నాయి. వాటిల్లో 6,100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో ఉర్దూ వర్సిటీ (150 సీట్లు), వరంగల్‌ ఎన్‌ఐటీ (50), లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (50)లో సీట్లు ఉన్నాయి. ఈ నెల 13 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. 30వ తేదీతో గడువు ముగుస్తుంది. జూన్‌ 12న ఆన్‌లైన్‌లో పరీక్షలు జరుగుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని