18.86 లక్షల మందికి గ్యాస్‌ రాయితీ

మహాలక్ష్మి పథకంలో భాగంగా రాయితీతో రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని ఏప్రిల్‌ 13 నాటికి 18,86,045 మంది వినియోగదారులు ఉపయోగించుకున్నారు.

Published : 15 Apr 2024 03:26 IST

ఈనాడు, హైదరాబాద్‌: మహాలక్ష్మి పథకంలో భాగంగా రాయితీతో రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని ఏప్రిల్‌ 13 నాటికి 18,86,045 మంది వినియోగదారులు ఉపయోగించుకున్నారు. మరికొందరు రెండో రాయితీ సిలిండర్‌ను పొందారు. ఇలా ఇప్పటివరకు 21,29,460 గ్యాస్‌ సిలిండర్లు తీసుకున్నారు. ఈ సిలిండర్లకు రూ.59.97 కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 39,33,615 గ్యాస్‌ వినియోగదారుల్ని రూ.500కు సిలిండర్‌ పథకానికి అర్హులుగా తేల్చింది. ఫిబ్రవరి 27 నుంచి ఈ పథకం ప్రారంభమైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని